
Srikakulam Government Hospital: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కలకలం రేపింది. ఆడుకుంటూ పడిపోవడంతో స్వల్ప గాయాలైన బాలుడికి, వైద్య సిబ్బంది పొరపాటున కుక్కకాటు టీకా (Anti Rabies Vaccine) ఇవ్వడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకోగా, విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి ఆర్.ఎం.ఓ. డా. బాలసుభాషిణి మాట్లాడుతూ, టీకా వల్ల బాలుడికి ఎటువంటి ఆరోగ్యపరమైన ప్రమాదం లేదని, అయితే విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: