Bank Holidays: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె పాటించనున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UF BU) వెల్లడించాయి. ఈమేరకు గురువారం హైదరబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తొమ్మిది బ్యాంకు, అధికారుల సంఘాల ఆధ్వర్యం లో జరిగిన మీడియా సమావేశంలో యుఎఫ్బియు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు.
Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్

వరుసగా నాలుగురోజులు బ్యాంక్లకు సెలవు
2015లో ప్రభుత్వం ప్రతి నెల 2వ, 4వ శనివారాలు సెలవ దినాలు ప్రకటించిందని గుర్తుచేశారు. బ్యాంకు ఉద్యోగులకు పని సమయం పెంచడం, మిగిలిన శని వారాలు పని దినాలుగా ప్రకటిం చేందుకు ప్రభుత్వం, యునైటెడ్ బ్యాంక్స్ అసోసియేషన్తో చర్చకు నిర్ణయించినట్లు తెలిపారు. తర్వాత 2023లో శుక్రవారం వరకు పని సమయాన్ని 40 నిమిషాలు పెంచి, మిగిలిన శనివారాలను సెలవు లుగా ప్రకటించాలని అంగీకరించి, ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారన్నారు. కానీ, రెండేళ్లుగా అది ఆమోదం పొందకుండా పెండింగ్ లోనే ఉందని కావున ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని నిరసిస్తూ 2025 మార్చి 24, 25న రెండు రోజులు బ్యాంకుల సమ్మెకు పిలుపూ నిచ్చామన్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తమ హామీలను పరిశీలి స్తుందని చెప్పగానే సమ్మెను వాయిదా వేశామన్నారు. బ్యాంకింగ్ రంగంలో 98శాతం కంటే ఎక్కువ లావాదేవీలు డిజిటల్ ద్వారానే జరుగుతు న్నందున ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఐదురోజులాు పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో ఫెడరేషన్ ప్రతినిధులు డి.ఎస్. రాంబాబు, శాండిల్య, కుమార్, సతీశ్, అర్జున్, సతీష్రెడ్డి, రాజేష్ కుమార్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ నెల 24 నాలుగో శనివారం, 25 న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవాలు, 27 న బ్యాంక్ సమ్మెతో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంక్లకు సెలవు రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: