हिन्दी | Epaper

Telangana: మద్యం ప్రియులకు షాక్

Anusha
Telangana: మద్యం ప్రియులకు షాక్

తెలంగాణ (Telangana) లో మద్యం అమ్మకాలు ఎప్పుడూ జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే బీరు విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అయితే, ఈ వేసవిలో బీర్ లవర్స్ నిరాశ ఎదురవ్వబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టడమే. సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతుల నేపథ్యంలో ఈ వేసవిలో రాష్ట్రంలో బీర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: Davos: తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ కు WEF మద్దతు

కారణాలు

ఈ మరమ్మతుల వల్ల సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్‌ కంపెనీలకు సింగూరు నుంచి అందే నీటి సరఫరా ఆగిపోనుంది. నీటి వనరులు లేకపోవడంతో బీర్ల ఉత్పత్తి భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ 44 లక్షల లీటర్ల నీరు సింగూరు జలమండలి నుంచి బీరు ఫ్యాక్టరీలకు సరఫరా అవుతోంది.

Telangana: Shock for alcohol lovers
Telangana: Shock for alcohol lovers

మరమ్మతుల కారణంగా ఈ నీటి సరఫరా నిలిచిపోతే, బీర్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు సంగారెడ్డి పట్టణంలో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఈ పంపిణీ ఆగిపోయిన‌ట్ల‌యితే జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు స‌ర‌ఫ‌రా అయ్యే బీర్లపై కూడా ప్ర‌భావం ప‌డ‌నుంది.మ‌రోవైపు ప్ర‌స్తుతం బీర్ల ఫ్యాక్టరీలకు నామమాత్రపు ధరకే ప్ర‌భుత్వం నీటిని అందిస్తున్నది.

ఇప్పుడు అధిక చార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఒక‌వేళ ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేస్తే తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌పై మ‌రింత భారం ప‌డ‌టం ఖాయం. అయితే వేస‌వి డిమాండ్ నేప‌థ్యంలో బీర్ల ఉత్పత్తిని పెంచాల‌ని, కొర‌త లేకుండా చూడాల‌ని ఇప్ప‌టికే బ్రూవ‌రీల‌కు ప్ర‌భుత్వం సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్

నాన్న మీ కల నెరవేరింది కానీ మీరు లేరు: రింకూ సింగ్

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870