హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సోనీ (SONY- TCL), టిసిఎల్భాగస్వామ్యం దిశగా ముందడుగు వేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. సోనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని నిర్వహించేలా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించనున్నారు.
Read Also: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
హోమ్ ఆడియో ఉత్పత్తులు ప్రధానంగా ఉంటాయి
ప్రతిపాదిత నిర్మాణంలో TCLకు 51 శాతం వాటా, సోనీకి 49 శాతం వాటా ఉండనుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం చర్చల దశలోనే ఉందని, ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని రెండు సంస్థలు స్పష్టం చేశాయి.చర్చలు, విజయవంతమైతే, ఈ కొత్త జాయింట్ వెంచర్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు చేపడుతుంది.

ఉత్పత్తుల డిజైన్, అభివృద్ధి, తయారీ, విక్రయాలు, లాజిస్టిక్స్, కస్టమర్ సపోర్ట్—హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం చైన్‌ను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది.ముఖ్యంగా, ఈ భాగస్వామ్యంలో టెలివిజన్లు,హోమ్ ఆడియో ఉత్పత్తులు ప్రధానంగా ఉంటాయి.రెండు కంపెనీలు 2026 మార్చి చివరికి బైండింగ్ ఒప్పందాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.అవసరమైన అనుమతులు సమీపిస్తే, 2027 ఏప్రిల్‌లో కొత్త సంస్థ కార్యకలాపాలను ప్రారంభించగలదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: