దావోస్(Davos)లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరస్పర గౌరవ సూచకంగా సీఎం రేవంత్ రెడ్డిని లోకేశ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
Read Also: Tirumala: టీటీడీలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత

ప్రపంచ ఆర్థిక వేదికలో తెలుగు రాష్ట్రాల పెట్టుబడులపై చర్చ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగా రెండు రాష్ట్రాలు తీసుకుంటున్న విధానాలు, భవిష్యత్తులో కలిసికట్టుగా చేయగల అవకాశాలపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ రంగాల్లో సహకారం పెంచుకునే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, ఈ దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కూడా భేటీ జరగనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకే వేదికపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొనడం వల్ల పెట్టుబడుల పరంగా కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: