టీ20 (T20) క్రికెట్లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ, భారత టీ20 క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సాధించిన ఘనత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Indonesia Masters 2026 tournament: చరిత్ర సృష్టించిన PV Sindhu

అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఆరో స్థానం
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన గురువు, భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ సింగ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 74 సిక్సర్లు కొట్టగా, అదే సమయంలో అభిషేక్ తన 33 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డు బ్రేక్ చేశాడు.
కాబట్టి అభిషేక్ తన మెంటార్‌ను 18 ఇన్నింగ్స్‌ల కంటే ముందే ఈ ఫీట్ చేరుకున్నాడు.ఈ ఘనతతో టీ20Iల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ఆరో స్థానానికి చేరాడు.యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. గురువును మించిన శిష్యుడిగా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
అభిషేక్ శర్మ ఏ ఫార్మాట్లో ఎక్కువగా గుర్తింపు పొందాడు?
అభిషేక్ శర్మ ముఖ్యంగా టీ20 క్రికెట్లో తన దూకుడు బ్యాటింగ్‌తో గుర్తింపు పొందాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: