ఆంధ్రప్రదేశ్‌కు(AP) అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యాలు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) దావోస్ పర్యటనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తన పర్యటనలో నాలుగో రోజు ఆయన టెక్నాలజీ దిగ్గజం యాక్సెంచర్, ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు, విద్యాభివృద్ధికి ఉన్న అవకాశాలను వారికి వివరించి, కీలక ప్రతిపాదనలు ముందుంచారు.
Read Also: AP: పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం యోచన

విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్
యాక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ & సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ) మనీష్ శర్మతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న(AP) విశాఖపట్నంలో తమ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలకు విశాఖను కేంద్రంగా మార్చుకోవాలని సూచించారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధికి తమ ‘ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్’ ద్వారా సహకారం అందించి, సంస్థకు అవసరమైన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి క్వాంటం వ్యాలీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) లలో భాగస్వామ్యం కావాలని కూడా ఆహ్వానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: