హైదరాబాద్ (HYD) బాలాపూర్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘ధర్మ రక్షా సభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 24న జరగనున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న సాకుతో పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని గణేశ్ ఉత్సవ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.

ఈ నెల 9వ తేదీనే దరఖాస్తు చేసుకున్నా పోలీసులు కావాలనే జాప్యం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ బాలాపూర్ మతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమని అక్కడ 26 క్యాంపుల్లో సుమారు 6,993 మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని పేర్కొంది. వారి నివాసాల వద్దే సభ నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీస్తుందని హోంశాఖ తరఫు న్యాయవాది వాదించారు.
Read Also: Online scams: ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త!
రోహింగ్యాల నివాసాలపై హైకోర్టు కీలక ప్రశ్నలు
ఈ క్రమంలో(HYD) ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. అక్కడ ఉంటున్న రోహింగ్యాల చట్టబద్ధమైన హోదా ఏమిటని కోర్టు ప్రశ్నించగా వారికి శరణార్థి హోదా లేదని, వారు అక్రమ వలసదారులేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే కేంద్ర హోంశాఖ వారి వివరాలను నమోదు చేసి గుర్తింపు కార్డులు మంజూరు చేసిందని వివరించారు.
అక్రమ వలసదారుల అంశంపై నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంటుందని అభిప్రాయపడుతూ కోర్టు సభకు అనుమతినిచ్చింది. సభకు అనుమతినిస్తూనే, శాంతిభద్రతల దృష్ట్యా హైకోర్టు కొన్ని కఠినమైన షరతులను విధించింది. సభను మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: