T20 (T20 World Cup) దగ్గరపడుతున్న వేళ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ ఫామ్లోకి వస్తున్నాడా లేదా అనేది ముఖ్యం కాదని, ఒక ఆటగాడు ఫామ్లో లేకుంటే.మనకు ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే.. మనకున్న ప్రధాన బ్యాటింగ్ పవర్ తడబాటుకు గురైతే పరిస్థితి కఠినంగా మారుతుంది.
Read Also: IND vs NZ: టీమిండియా ఘన విజయం

సూర్య కెప్టెన్సీలో ఎలాంటి ఇబ్బందీ లేదు
మనకు ఉన్న ప్రధాన శక్తి బ్యాటింగ్.. ఇందులో మీరు ఒకరిని వదిలివేస్తే, అది ఉండాల్సినంత ప్రభావవంతంగా ఉండదని, సూర్య బాగా ఆడకపోతే, బ్యాటింగ్ లైనప్ దెబ్బతింటుందని, రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఆట గురించి, అతనితో ఆడుతున్న ఆటగాళ్ల గురించి, వారి నుండి ఉత్తమ ప్రదర్శన పొందాలో సూర్యకు చాలా అవగాహన ఉందని తాను భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. తద్వారా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఎలాంటి ఇబ్బందీ లేదని, కేవలం బ్యాటింగ్ ను సరి చేసుకుంటే జట్టును విజయాల బాట పట్టించవచ్చని మూడు ఫార్మాట్లలోనూ అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ చెప్పకనే వెల్లడించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: