శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (Tirupati) మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్లర్ కి వినత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ మాట్లాడుతూ క్రీడలకు ప్రఖ్యాతగాంచినది తిరుపతి నగరం, అలాంటి నగరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తో పాటుగా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ ని కూడా ప్రవేశపెట్టాలని అటు విద్యార్థులు, క్రీడాకారులు కోరుకుంటున్నారు. ఇదే యూనివర్సిటీలో బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ కోసం ఇతర యూనివర్సిటీల వైపు మగ్గుచూపుతున్నారు, మన యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీకి సుమారుగా 50 మంది అర్హత పొందారు.
Read Also: Tirupati District: రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు

విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ఎడ్ కోర్సు ప్రారంభానికి వీసీ హామీ
తిరుపతి (Tirupati) దగ్గరలో ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజీలో ఒకటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉండడం వలన ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల (Students) వద్ద నుండి అటెండెన్స్ పేరుతో, ప్రాక్టికల్స్ పేరుతో, రకరకాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసి మన యూనివర్సిటీలోనే ఈ కొత్త సంవత్సరం గాను మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘాలుగా కోరుకుంటున్నాము.
మెమొరాండం సమర్పించిన వెంటనే వీసీ సానుకూలంగా స్పందించి వెంటనే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టడానికి తగిన చర్యలు చేపడతామని చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులకు విసి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, జిల్లా కార్యదర్శి. లోకేష్, జిల్లా అధ్యక్షులు శివ బాలాజీ, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి కుమార్, సుందరాజు, ముని,విద్యార్థులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: