సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ గాయని ఎస్. జానకి (S Janaki) కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. ఇవాళ, తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషాద వార్తతో సినీ, సంగీత వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
Read Also: Abishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు టీజర్ చూసారా?

కొన్ని మూవీల్లో కూడా కీలక పాత్రలు పోషించారు
మురళీకృష్ణ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతడు సుప్రసిద్ధ భరతనాట్య కళాకారుడు. శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన.. పలువురు విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. అంతేకాకుండా నటనపై ఆయనకు ఉన్న మక్కువతో కొన్ని మూవీల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మురళీకృష్ణ మృతి పట్ల పలువురు సినీ హీరోలు, నిర్మాతలు, అభిమానులు, పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: