AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్(Kaveri Travels)కు చెందిన బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. నరసాపురం నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ బస్సులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Read Also: Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత

ఇంజన్ బెల్ట్ రాపిడితో పొగలు
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే బస్సును తనిఖీ చేయగా, ఇంజిన్‌లోని బెల్ట్ రాపిడికి గురవడం వల్ల పొగలు ఏర్పడ్డాయని నిర్ధారించారు. బస్సులో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అయితే భద్రతపై సందేహాలు వ్యక్తం చేసిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం అర్ధరాత్రి మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానానికి పంపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: