నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొట్టాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.
Read Also: Uppal Stadium : ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు పెట్టండి మహాప్రభో !!
ఎవిన్ లూయిస్ రికార్డ్ బద్దలు..
అంతర్జాతీయ టీ20ల్లో 25 బంతుల్లోపే హాఫ్ సెంచరీ సాధించడం అభిషేక్ శర్మకు ఇది 8వ సారి. ఈ క్రమంలో అతను ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్ ప్లేయర్ ఎవిన్ లూయిస్‌లను అధిగమించాడు. ఈ ముగ్గురు బ్యాటర్లు 25 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.ఈ క్రమంలో అతను కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల రికార్డ్‌ను అభిషేక్ శర్మ అధిగమించాడు. ఈ ఇద్దరూ 23 బంతుల్లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ సాధించగా.. అభిషేక్ శర్మ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌తో 84 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అతని విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.అభిషేక్ శర్మకు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: