हिन्दी | Epaper
బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే

IND vs NZ: టీమిండియా ఘన విజయం

Aanusha
IND vs NZ: టీమిండియా ఘన విజయం

ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ (IND vs NZ) తో జరిగిన మ్యాచ్ లో, టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌‌‌ను ఓడించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తీ స్టన్నింగ్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Read Also: Gautam Gambhir head coach : ప్రధాని తర్వాత కష్టమైన ఉద్యోగం ఇదేనా? గంభీర్‌పై థరూర్ వ్యాఖ్యలు

కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) అతనికి చక్కటి సహకారం అందించాడు.

IND vs NZ: Team India registers a resounding victory
IND vs NZ: Team India registers a resounding victory

చివర్ లో, రింకూ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.భారీ లక్ష్యఛేదనలో కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ డెవాన్ కాన్వే (0), రచిన్ రవీంద్ర (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.

అతనికి మార్క్ చాప్‌మన్ (39) జత కలిసినప్పటికీ, భారీ లక్ష్యం ముందు వారి పోరాటం సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది.భారత బౌలర్లలో శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870