हिन्दी | Epaper
భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Deepinder Goyal: జొమాటో సీఈవో రాజీనామా! అసలు కారణం ఇదే..

Rajitha
Deepinder Goyal: జొమాటో సీఈవో రాజీనామా! అసలు కారణం ఇదే..

ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Ltd) సంస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యవహరిస్తున్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. గోయల్ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక స్పష్టమైన ఆలోచన ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Read also: Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

Zomato CEO resigns

Zomato CEO resigns

షేర్ హోల్డర్లకు లేఖలో ఏమన్నారు?

తన రాజీనామా కారణాలను వివరిస్తూ దీపిందర్ గోయల్ షేర్ హోల్డర్లకు భావోద్వేగ లేఖ రాశారు. ఇటీవల తనను ఆకర్షిస్తున్న కొన్ని కొత్త ఆలోచనలు అత్యధిక రిస్క్‌తో, ప్రయోగాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అలాంటి ఆలోచనలు ఎటర్నల్ వంటి పబ్లిక్ కంపెనీ వ్యూహాలకు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ క్రమశిక్షణతో, స్పష్టమైన వ్యాపార లక్ష్యాల పరిధిలోనే ముందుకు సాగాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. అందుకే కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను బయటకు వెళ్లి తన వ్యక్తిగత కలలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడించారు.

జొమాటో నుంచి ఎటర్నల్ వరకు – నాయకత్వ మార్పు

2008లో Foodiebayగా మొదలైన ప్రయాణం, తరువాత Zomatoగా మారి దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ రంగాన్ని కొత్త మలుపు తిప్పింది. గోయల్ నాయకత్వంలో జొమాటో ఐపీఓకు వెళ్లి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని సంపాదించింది. అనంతరం Blinkit కొనుగోలుతో క్విక్ కామర్స్‌లోనూ సంస్థ బలంగా అడుగుపెట్టింది. అన్ని వ్యాపారాలను ఒకే బ్రాండ్ కిందకు తీసుకువచ్చి Eternalగా మారింది. ఇప్పుడు గోయల్ స్థానంలో బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధీండా కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీతో నిండిన క్విక్ కామర్స్ మార్కెట్లో ఎటర్నల్ గ్రూప్‌ను మరింత ముందుకు నడిపించడమే ఆయన ముందున్న ప్రధాన సవాలు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870