తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నే ప్రత్యేక గుర్తింపు ఉన్న పటాన్చెరు నియోజక వర్గం ఏమ్మెల్యే కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాట్లు తెలుస్తోంది. ఏ నేత అయినా అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ లో చేరేందుకు సుముఖంగా ఉంటే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతారు. కానీ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చేరికకు మాత్రం ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ లు నో ఎంట్రీ బోర్డు లు పెడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని పటాన్చెరు నియోజక వర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మినీ ఇండియా గా పేరు గాంచిన అ నియోజక వర్గానికి వరుసగా గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీపీ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకునికి ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Hanamkonda: తండ్రీ కుమారుల తగాదాతో నానమ్మ దుర్మరణం
బీఆర్ ఎస్ లో చేరికను అడ్డుకుంటున్న నేతలు!
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమ్మెల్యే గా గెలిచినప్పటికీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారీక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తలు సహకరించకపోవడం తో కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆయన మళ్లీ తాను పార్టీ మారలేదు ఎప్పటికి టిఆర్ఎస్ ఏమ్మెల్యే నే అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

సొంత అనుచరులే మళ్లీ అధికారికంగా టీఆర్ ఎస్ పార్టీ లో చేరాలని ఒత్తిడి చేయడం ఆ దిశగా అడుగులు వేశారు. చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు టీఆర్ఎస్ ఏమ్మెల్యే గా గెలిచిన గూడెం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ముందు వ్యతిరేకించిన కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం అదే పంథాను కొనసాగించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో ఇమడ లేక మళ్లీ టిఆర్ ఎస్ వైపు మొగ్గు చూపారు. టీఆర్ ఎస్ లో కీలక నేత హరీశ్ రావు కు నమ్మిన బంటు గా ఉన్న గూడెం ఇప్పుడు పార్టీలో కి ఆహ్వానించే వారే లేరు.
ఏటూ తేల్చుకోలేక సతమతం అవుతున్న నేతలు
(Telangana) దీంతో గూడెం బ్రదర్స్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాట్లు తెలుస్తోంది జనవరి 17 న గూడెం బ్రదర్స్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కేటీఆర్ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ నియోజక వర్గంలో ని నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం తో గూడెం కు చుక్కెదురయిందని ప్రచారం జరిగింది. గూడెం తో పాటుగా మరికొంత మంది ఆయన అనుచరులు మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారి చేరికకు స్వాగతం పలికిన నేతలు, గూడెం కు మాత్రం నిరాశే మిగిలింది!. హ్యాట్రిక్ ఏమ్మెల్యే కు అధికార , ప్రతిపక్ష పార్టీ లో అసమ్మతి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నేతగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి కి అలాగే ఆయన సోదరుడు గూడెం మధు కు ఇటు అధికార అటు ప్రతిపక్ష రెండు పార్టీ ల్లో నో ఎంట్రీ చెప్పడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ లో చేరిన తన సత్త చాటాలి అనుకున్న గూడెం కు గడ్డు పరిస్థితులు నెలకొన్నాట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: