సంక్రాంతి పండగ ప్రయాణాలు ఏపీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. జనవరి 19 ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.8 కోట్ల ఆదాయం వచ్చింది. సెలవులకు ముందు, తర్వాత వరుసగా వారాంతాలు రావడం సంస్థకు కలిసొచ్చిందని అధికారులు వెల్లడించారు.
Read Also:WEF 2026: ఏపీలో RMZ పెట్టుబడులతో లక్షల ఉద్యోగ అవకాశాలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యేక సర్వీసుల ప్రభావం
జనవరి 8 నుంచి 19 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా మొత్తం రూ.18.19 కోట్ల ఆదాయం సమకూరింది. రోజుకు సగటున 735 ప్రత్యేక బస్సులు, మరోవైపు 1,012 సాధారణ సర్వీసులు నడిపారు. ఈ బస్సులు(APSRTC) సుమారు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. జనవరి 10 నుంచి 13 వరకు రోజుకు వెయ్యి బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజుల్లో సగటున రోజుకు రూ.1.52 కోట్ల ఆదాయం వచ్చింది.
గతేడాదితో పోలిస్తే భారీ వృద్ధి
గతేడాది ఇదే కాలంలో 12 రోజులకు రూ.15.15 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.3.04 కోట్లు పెరిగి రూ.18.19 కోట్లకు చేరింది. ఇందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.15.53 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.2.66 కోట్లు రాబడి వచ్చింది.
స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికులు
స్త్రీశక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో 70 శాతం పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. గతంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న సర్వీసుల్లో ఇప్పుడు సగటున 75 శాతం నమోదు అవుతోందని అధికారులు తెలిపారు.
ఆర్టీసీ పునరుజ్జీవనానికి బలంగా పథకాలు
స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించనుంది. దీంతో సంస్థ(APSRTC) ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది. కొత్త బస్సులు, ప్రత్యేక కార్యాచరణతో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: