ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు మరోసారి పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఈ మేరకు మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు. ఈ పెంపుతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్

రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుంది.సాధారణంగా ప్రభుత్వాలు చట్టప్రకారం ఎప్పటికప్పుడు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ఉంటాయి. నగరాలు, పట్టణాల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూములకు డిమాండ్ పెరుగుతుంది.
అలాగే బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ధరలను కొంతమేర మెరుగుపరచాలన్న ఉద్దేశంతో భూముల విలువలను ప్రభుత్వాలు పెంచుతాయి. దీనివల్ల రిజిస్ర్టేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీల రూపంలో ఆదాయం పెరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: