ఆది సాయికుమార్ నటించిన, సినిమా ‘శంబాల’ (Shambala). గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శంబాల డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) సొంతం చేసుకుంది. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
Read Also: Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు
అయితే ఓ ప్రత్యేక నిబంధనతో ఆహా ఈ సినిమాను రిలీజ్ చేసింది. ప్రస్తుతం శంబాల సినిమాను ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. సాధారణ సబ్‌స్క్రైబర్లకు మాత్రం రేపటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో గోల్డ్ యూజర్లకు ఒకరోజు ముందుగానే ఈ థ్రిల్లర్‌ను చూసే ప్రత్యేక అవకాశం లభించింది.

‘ఛాంపియన్’ ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం
యువ హీరో రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ (Champion) ఓటీటీ విడుదలపై తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా జనవరి 23, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ డిజిటల్ హక్కుల డీల్ దాదాపు రూ.16 కోట్లకు కుదిరినట్లు సినీ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: