తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీలో నిర్ణయాలు, భక్తుల సౌకర్యాల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో (TTD) కొత్త మార్పులు అలిపిరిలో బేస్ క్యాంపు దిశగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. అదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ సేవలను పెంచుతోంది. (Tirumala) కాగా, టీటీడీ కీలక బాధ్యతల్లో మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరి కోరి ఈ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఆపై ఏపీ క్యాడర్ నుంచి తెలంగాణ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తెలంగాణలోనే సర్వీసు నుంచీ రిటైర్ అయ్యారు.
Read Also: Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్

ఏడాది పాటు జేఈవోగా కొనసాగనున్న శరత్
(Tirumala) టీటీడీలో రిటైర్డు ఐఏఎస్ అధికారులను జేఈవో పోస్టులో నియమించడం చాలా అరుదు. గతంలో కుప్పంలో కడా ప్రత్యేక అధికారిగా విజయవంతంగా పనిచేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో సన్నిహిత పరిచయాలున్న అధికారిగా చెబుతారు. శరత్ సమర్ధత పైన ఉన్న నమ్మకంతో ఆయనకు కీలకమైన టీటీడీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వింగ్ జేఈవో పోస్టులో నియమించేందుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టులో ప్రాథమికంగా ఏడాది పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య రంగానికి సంబంధించిన అంశాల పైన శరత్ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. స్విమ్స్, రుయా ఆస్పత్రులు టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: