తెలంగాణ లో, (Telangana) సినిమా టికెట్ ధరల పెంపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రక్రియ విడుదలకు కనీసం 90 రోజుల ముందే పూర్తి కావాలని స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్–1955 ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేసింది.నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడిపోయారు.
Read Also: Telugu weddings: మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

పాత విధానానికి ఇక గుడ్‌బై
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల విషయంలో ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా మారనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.విడుదల తేదీ ఖరారు చేయకుండా, షూటింగ్ ఆలస్యమవుతూ చివర్లో టికెట్ ధరలు పెంచుకునే పాత విధానానికి ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనని అంటున్నారు. 90 రోజుల ముందే విడుదల తేదీని ప్రకటించి, ప్రభుత్వ అనుమతులు పొందితేనే పెరిగిన ధరలతో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: