हिन्दी | Epaper
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Hyderabad: ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు

Tejaswini Y
Hyderabad: ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు

బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణం

హైదరాబాద్(Hyderabad) నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను ఒకే సమగ్ర వ్యవస్థగా అనుసంధానించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ చర్యల ద్వారా ప్రయాణికులకు ఫస్ట్ మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు నగర రహదారులపై ట్రాఫిక్ భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్‌

Hyderabad: Check traffic tension.. Three services with one ticket
Hyderabad: Check traffic tension.. Three services with one ticket

ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో మార్పులు

సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వికాస్ రాజ్, నగరంలోని మొత్తం 51 ఎంఎంటీఎస్(MMTS) స్టేషన్ల చుట్టుపక్కల ఉన్న అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు జీహెచ్‌ఎంసీ మరియు ఆర్టీసీకి అందజేస్తారని తెలిపారు.

ఒకే టికెట్‌తో ప్రయాణించే వీలుగా సమగ్ర టికెటింగ్

ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బస్ స్టాప్‌లను రైల్వే స్టేషన్లకు మరింత సమీపంగా తరలించడంతో పాటు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు మార్గాలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు వెల్లడించారు. అదనంగా, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప నివాస ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ ఫీడర్ సర్వీసులను ప్రారంభించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ముఖ్యంగా మెట్రో రైలు, ఎంఎంటీఎస్ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించే వీలుగా సమగ్ర టికెటింగ్ విధానంపై అధ్యయనం చేయాలని మీ–సేవ కమిషనర్‌కు సూచించినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే హైదరాబాద్‌లో ఆధునిక మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870