హైదరాబాద్ (HYD) లోని, బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొని అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదం కారణంగా బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Read Also: Medaram Jathara : మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు – పొన్నం

వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్ సహాయంతో బోల్తా పడిన కారును అక్కడి నుంచి తొలగించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. నగరంలో వర్షం కురుస్తున్న సమయంలో లేదా రద్దీగా ఉండే ఫ్లైఓవర్లపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితిని పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: