మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ (WPL 2026) లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ జట్టు, మరో ఓవర్ మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.. లిజెల్లీ లీ(46), షఫాలీ వర్మ(29)లు బౌండరీలతో చెలరేగుతూ ముంబై బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. తొలి వికెట్‌కు 63 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని వైష్ణవీ శర్మ విడదీసింది.
Read Also: Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం
ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ
ఆఫ్ సైడ్ ఆడాలనుకున్న షఫాలీని తను క్లీన్‌బౌల్డ్ చేసింది.ఆ తర్వాత లారా వొల్వార్డ్త్(17)తో కలిసి జెమీమా రోడ్రిగ్స్(51 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ నిర్మించింది. అయితే.. నాట్ సీవర్ ఓవర్లో లారా అనూహ్యంగా రనౌట్ కాగా జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది కెప్టెన్. బ్రంట్ ఓవర్ లో, సిక్సర్ బాదిన తను.. ఆపై మాథ్యూస్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో ఢిల్లీని గెలుపు వాకిట నిలిపింది. 19వ ఓవర్ చివరి బంతికి మరిజానే కాప్(10 నాటౌట్) సిక్సర్ బాదగా ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

కీలకమైన పోరులో ముంబై ఇండియన్స్‌ను భారీ స్కోర్ చేయనివ్వలేదు ఢిల్లీ క్యాపిటల్స్. పవర్ ప్లేలోనే రెండు వికెట్లతో ముంబైకి షాకిచ్చినా.. నాట్ సీవర్ బ్రంట్(65 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(41)లు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో ముంబైని ఆదుకున్నారు. శ్రీ చరణి(3-33) మూడు వికెట్లతో చెలరేగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే.. చివరిదాకా నిలబడిన నాట్‌సీవర్.. సంస్కృతి గుప్తా(10 నాటౌట్) ఓవర్లలో 20 రన్స్ రావడంతో ముంబై స్కోర్ 150 దాటింది. ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ విజయంతో సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: