ఆంధ్రప్రదేశ్ (AP)లోని రాజమహేంద్రవరం దివాన్‌చెరువు సమీపంలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో కూడిన మరో రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.రోడ్డుపై గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయగా, వెనుక ఉన్న మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t065316-2026-01-21-06-56-59.jpg)
గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు
సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, సిబ్బంది చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని మూడు అంబులెన్స్‌ల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: