తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ ముగిసిన అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మరియు సిట్ (SIT) చీఫ్ వి.సి. సజ్జనార్ మీడియాకు విచారణకు సంబదించిన వివరాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ కేసులో కీలకమైన అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లు తెలిపారు. హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఎటువంటి ‘స్టే’ రాలేదని, చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే ఆయన విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఒకవేళ కేసు దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినా లేదా స్పష్టత అవసరమైనా ఆయనను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని సీపీ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Davos Tour : లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్
విచారణ మధ్యలోనే హరీశ్ రావు బయటకు వెళ్లడంపై వస్తున్న ఊహాగానాలకు సజ్జనార్ తెరదించారు. తన కుమారుడు ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్తున్నారని, ఆ క్రమంలో కుటుంబ పరమైన పనులు ఉన్నాయని హరీశ్ రావు అధికారులను కోరినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు, విచారణ ముగిసిన తర్వాత ఆయనను ముందుగానే పంపేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ కేసులో ఆయనకు కొన్ని కీలక సూచనలు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడంతో దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విచారణ సందర్భంగా హరీశ్ రావుకు సిట్ అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని, అలాగే దర్యాప్తుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఈ కేసులో మరింత లోతైన ఆధారాలు సేకరిస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సజ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com