Harish Rao allegations : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణ తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది పాత్ర త్వరలో బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ విచారణ పేరుతో హడావిడి చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
తాను ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తినని, ఇలాంటి విచారణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నానని, చట్టంపై గౌరవంతోనే నోటీసులు అందుకున్న వెంటనే విచారణకు హాజరయ్యానన్నారు. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు వస్తానని, ఏది అడిగినా నిజాయితీగా సమాధానం చెబుతానని తెలిపారు. సీఎం కేసీఆర్ తమకు ధైర్యంగా బతకడం నేర్పించారని వ్యాఖ్యానించారు.
Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు కేంద్రంగా (Harish Rao allegations) మారిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ స్కామ్‌లపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే బొగ్గు కుంభకోణం కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనకుండా విచారణల పేరుతో ప్రతిపక్షాలను వేధిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: