పట్టణ రాజకీయాల్లో కీలక మలు పుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దా డింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావర ణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక సంస్థలు 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు అన్నింటికీ మేయర్, చైర్పర్సన్, కార్పొరేట ర్, కౌన్సిలర్స్థా యిల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ నిర్ణయాలు కేవలం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియగానే కాకుండా, రాబోయే రాజకీయ సమీకరణలకు దిశానిర్దేశం చేసే అంశంగా మారాయి. ము ఖ్యంగా బీసీలకు 31శాతం రిజర్వేషన్ అమలు, మహిళలకు పెద్ద ఎత్తున చైర్పర్సన్, మేయర్స్థా నాల కేటాయింపు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా సంఖ్యల నిర్ణయం ఈ మూడు అంశాలు ఈ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా మార్చాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో గత అనుభవాలను పరిశీలిస్తే, రిజర్వేషన్ల అంశమే అత్యంత వివాదాస్పదంగా మారిన సందర్భాలు అనేకం.
Read Also : RBI: నకిలీ నోట్లపై అలర్ట్.. అసలు, నకిలీ తేడాలు తెలుసుకోండి

బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల జోక్యం
ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల జోక్యం కారణంగా గతం లో ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమి షన్ను ఏర్పాటు చేసి, జనాభా గణాంకాలు, సామాజిక- ఆర్థిక పరిస్థితులు, పట్టణ ప్రాంతాల్లో వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయించింది. ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 31 శాతం రిజర్వేషన్ ఖరారు చేయడం ద్వారా ప్రభుత్వం ఒకవైపు సామాజిక న్యాయాన్ని ప్రతిపాదిస్తూనే, మరోవైపు న్యాయపరమైన అడ్డంకులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకు న్నట్టు స్పష్ట మవుతోంది. పట్టణ ప్రాంతాల్లో బీసీల జనాభా గణనీయం గా ఉన్నప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ నిర్ణయం ఆ అసమతుల్యతను సరిచేసే దిశగా కీలక అడుగుగా భావించ బడుతోంది. మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలుస్తోంది. మొత్తం మున్సిపాలిటీల్లో 60 చైర్పర్సన్ స్థానాలు, కార్పొరేషన్లలో 5 మేయర్ స్థానాలు మహిళలకు కేటాయించబడటం పట్టణపాలనలోమహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా చూడాలి. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళా రిజర్వేషన్లు విస్తృత ప్రభావం చూపిన నేపథ్యంఉంది. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లోనూ మహిళా ప్రాతి నిధ్యం పెరగడం వల్ల పాలనలో కొత్త దృక్పథం, ప్రజా సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ, సామాజిక సమస్యల పట్ల సున్నితత్వం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయి తే, మరోవైపు కుటుంబ రాజకీయాలు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అధికారాన్ని వినియోగించే పరిస్థితులు కొనసాగు తాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, దీర్ఘ కాలికంగా చూస్తే మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరగ డం ప్రజాస్వామ్యానికి మేలుచేస్తుందన్న వాదనకు ఈ నిర్ణ యాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ప్రచార వ్యూహాలపై దృష్టి
జీహెచ్ఎంసీ సహా అన్నికార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఫైనల్ కావడం వల్ల ఇప్పుడు రాజకీయ దృష్టి పూర్తిగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపైకి మళ్లింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు (municipal elections) ఎప్పుడూ రాష్ట్ర రాజకీ యాలకు దిక్సూచిగా భావించ బడతాయి. హైదరాబాద్ నగరం రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక కేంద్రంగా ఉండటం వల్ల ఇక్కడి ఫలితాలు మిగతా ప్రాంతాలపై ప్రభా వం చూపుతాయి. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి కార్పొరేషన్లలోనూ పట్టణ మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు, యువత ఓటింగ్ తీరు కీలకంగా మారనుంది. ప్రభుత్వం ఆరు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం ద్వారా ఎన్నికల నిర్వహణపై తన సంకల్పాన్ని స్పష్టంగా చాటింది. వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు కలెక్టర్లకు, మున్సిపల్ అధికా రులకు పంపించడంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు వేగవంత మయ్యాయి. కేబినెట్ భేటీ అనంతరం ఎవరికీ ఏ స్థానం అన్న స్పష్టత రావడంతో ఆశావహుల్లో కదలిక మొదలైంది. ఒకే పార్టీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్న పరిస్థితి అనేక చోట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీ, మహిళా రిజర్వే షన్ వచ్చిన స్థానాల్లో పోటీ తీవ్రంగా మారే సూచనలు ఉన్నాయి. ఇది పార్టీలకు అంతర్గత అసంతృప్తులను ఎదు ర్కొనే పరిస్థితిని కూడా తెచ్చిపెట్టవచ్చు. ప్రభుత్వ వ్యూహాన్ని గమనిస్తే, ఈ ఎన్నికలను ఒకరకంగా ప్రజాభిప్రాయ సేక రణగా మలచుకోవాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, సంక్షేమ పథ కాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ ద్వారా సామాజిక న్యాయాన్ని, మహిళా రిజర్వేషన్ల ద్వారా ప్రగతిశీల పాలనను ప్రతిబింబించేలా ప్రభుత్వం తన వాద నను నిర్మిస్తోంది.
అభివృద్ధి పనులు
పట్టణ ప్రాంతాల్లో అమలు చేసిన అభివృద్ధి పనులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తాయ న్నది ఫలితాల్లో తేలనుంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈఎన్ని కలను ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశంగా చూస్తున్నాయి. పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు, ఆస్తి పన్నులు, ట్రాఫిక్ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకోవాలని భావిస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రి యలో కొన్ని చోట్ల అసమతుల్యత ఉందన్న ఆరోపణలు, వార్డు పునర్విభజనలో రాజకీయ లాభనష్టాల కోణంఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లు అభివృద్ధి, పారదర్శకత, స్థానిక సమస్యల పరిష్కా రాన్ని ప్రాధాన్యంగా చూస్తారని ప్రతిపక్షాలు అంచనా వేస్తు న్నాయి. గణాంకాల పరంగా చూస్తే, 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 31 శాతం రిజర్వేషన్ అమలవడం వల్ల వేలాది మంది కొత్త నాయకులు రాజకీయరంగ ప్రవేశం చేసే అవ కాశం ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లతో కలిపి మొత్తం పట్టణ స్థానిక సంస్థల పాలనలో విస్తృత సామాజిక ప్రాతినిధ్యం కనిపించనుంది. ఇది స్థానిక సమస్యల పరిష్కా రంలో విభిన్న వర్గాల స్వరాలు వినిపించే అవకాశాన్ని పెం చుతుంది. అయితే, అదే సమయంలో అనుభవం లేని నాయ కత్వం వల్ల పరిపాలనా సామర్థ్యం తగ్గుతుందన్న ఆందోళ నలూ వ్యక్తమవుతున్నాయి. దీనికి సమాధానం ఎన్నికలఅనం తరం పాలనలోనే తేలనుంది. వచ్చే నెల రెండో వారంలోపే ఎన్నికలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో షెడ్యూల్ ఖరారు కావడంతో ప్రచారం మరింత ఉధృతం కానుంది. తక్కువ సమయంలో ఓటర్లను చేరుకోవడానికి పార్టీలన్నీ
సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచారం, వార్డుస్థాయి సమావేశాలపై ఎక్కువగా ఆధారపడనున్నాయి.

యువత ఓటింగ్ శాతం
యువత ఓటింగ్ శాతం పెరిగే అవకాశముండటంతో వారి సమస్యలు, ఆశలు కూడా ప్రచారం లో ప్రధాన అంశాలుగా మారతాయి. పట్టణ ఓటర్లు కేవలం పార్టీ అనుబంధంతో కాకుండా, అభ్యర్థి వ్యక్తిత్వం, స్థానిక సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి పెరుగు తోంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఇది సామాజిక న్యాయం, మహిళా సాధికారత, పట్టణ పాలనలో సమగ్రత అనే మూడు మూలస్తంభాలపై ఆధారపడి ముం దుకు సాగుతున్న ప్రక్రియగాచూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలనకే పరిమితం కాకుండా, రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై కూడా ప్రభా వం చూపే సూచనలు ఉన్నాయి. పట్టణ ఓటర్లు ఇచ్చేతీర్పు రాష్ట్రరాజకీయ దిశను ఎంతవరకు మార్చగలదన్నది త్వరలో తేలనుంది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలే పునాది అన్న భావనను మరోసారి గుర్తుచేస్తూ, ఈమున్సి పల్ఎ న్నికలు (municipal elections)ఒక కీలక అధ్యాయంగా చరిత్రలో నమోదు కానున్నాయి.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: