జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్
విజయవాడ : మీడియేషన్లో కేసుల సెటిల్మెంట్ విషయంలో న్యాయవాదులదే ప్రముఖ పాత్ర అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ పేర్కొన్నారు. అందుకే న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం చేపట్టారని వివరించారు. న్యాయవాదులు అందరూ కేసుల పరిష్కారం విషయంలో తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపు నిచ్చారు. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటి, (AP) ఆధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు లాయర్లకు “మధ్యవర్తిత్వము” అనే అంశం పై విజయవాడ కోర్ట్ ప్రాంగణంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. సదరు శిక్షణా తరగతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 35 మంది లాయర్లకు కాన్పెప్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మీడియేషన్ అనే అంశంపై తరగతులను నిర్వహించడానికి తమిళనాడు హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ట్రైనర్స్ ఆర్. విజయకమల, సత్యారావులు నియమింపబడ్డారు.
Read Also: Jagtial: కొండగట్టు అంజన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

ఈ సందర్భంగా (AP) హైకోర్టు(High Court) న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు తక్కవ ఖర్చుతో, తక్కువ సమయంలో త్వరితగతిన పరిష్కారం అందించుట కోసం సుప్రీమ్ కోర్టు ఈ మీడియేషన్ అనే అంశాన్ని ప్రవేశ పెటారని, దానిలో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 35 మంది న్యాయవాదులకు రెండో విడతలో శిక్షణ ఇస్తున్నారు అని జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది ట్రైన్డ్ అడ్వొకేట్ మీడియేటర్స్ ఉన్నారు అని ఈ రెండో విడతలో మరో 35 మందికి ఈ శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు.
ఎపిఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి బిఎస్వి హిమబిందు, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సత్యానంద్, డిఎస్ఎల్ఎ కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య, ఎపిఎస్ఎల్ఎస్ఏ డిప్యుటి సెక్రటరి హెచ్. అమర రంగేశ్వర రావు, ఇతర న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇవి 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకుని కేసులను సత్వరం పరిష్కరించే దిశలో అడుగులు వేయాలని వక్తలు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: