విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ మార్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన స్విట్జర్లాండ్ పర్యటన ఆరంభమైంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే ఒక వ్యూహాత్మక ముందడుగు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్ వేదికగా కార్యచరణలో పెట్టారు. స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఒక ప్రణాళికాబద్ధమైన చర్చ. స్విట్జర్లాండ్ ఫార్మా రంగం విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైమాటే. ఈ రంగంలో ప్రపంచ దిగ్గజాలైన నోవార్టిస్రోచె, లోంజా, ఆల్కాన్ వంటి కంపెనీలను ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ విప్లవాన్ని తీసుకురావాలని లోకేష్ భావిస్తున్నారు.
Read also: Kalichetti Appalanaidu : వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

Swiss support for the new Andhra Pradesh
ఫార్మా, R&D, విద్య, AI శిక్షణ
అదే విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. ఈ సంస్థలు అడుగుపెడితే, రాష్ట్రంలో కేవలం మందుల తయారీ కేంద్రాలే కాకుండా, అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటవుతాయి. ఇది విశాఖ వంటి నగరాలను గ్లోబల్ ఫార్మా హద్దుగా మారుస్తుంది. జ్యూరిచ్, చాసెల్, బెర్న్ మరియు జెనీవా వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలు, ఏపీలో ప్రతిపాదించిన స్కిల్ యూనివర్సిటీ మరియు ఈ యూనివర్సిటీలను ఈ స్విస్ వర్సిటీలతో అనుసంధానించడం లోకేష్ వి కీలకమైన అంశం. ఏపీ యువతకు కృత్రిమ మేధస్సులో ప్రపంచ స్థాయి శిక్షణ. మన విద్యార్థులు స్విస్ పర్సిటీల్లో పరిశోధనలు చేసే అవకాశం, తద్వారా అంతర్జాతీయ నైపుణ్యాల బదిలీ.
ఇంజనీరింగ్, తయారీ రంగాలు
యంత్రాల తయారీ, రైలు విడిభాగాలు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తితీతీ, లైటెం వంటి సంస్థల సహకారాన్ని మంత్రి కోరారు. స్విస్ ఇంజనీరింగ్ నైపుణ్యం ఏపీకి రావడం వల్ల, రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లు అత్యాధునిక సాంకేతికతతో పునరుజ్జీవం పొందుతాయి. ఇది స్థానిక యువతకు భారీగా ఉపాధిని అందించడమే కాకుండా, విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. స్విట్జర్లాండ్లో స్థిరపడిన ఈ వ్యూహం వెనుక దాదాపు 27,000 మంది భారతీయుల్లో అధిక శాతం తెలుగు వారే. వీరిని కేవలం ప్రవాసీయులుగా కాకుండా. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చాలని లోకేష్ సంకల్పించారు.
స్టార్టప్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్, నాలెడ్జ్ ఎకానమీ
“ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో, అక్కడ సంపాదించిన జ్ఞానాన్ని, పెట్టుబడులను ఏపీ స్టార్టప్ వ్యవస్థలోకి మళ్లించడం ఉన్న అసలు ఉద్దేశం. స్విట్జర్లాండ్లో సాంకేతిక నిపుణుల కొరతను ఏపీ యువతతో భర్తీ చేయాలన్న ప్రతిపాదన విప్లవాత్మకమైనది. ఖివర్క్ ఫ్రమ్ హోమ్య పద్ధతి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువత కూడా స్విస్ కంపెనీలకు సేవలు అందించేలా చేయడం ద్వారా, ఐటీ రంగాన్ని టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించవచ్చు. ఈ విష్ లిస్ట్ సాకారం కావడానికి అక్టోబర్ 2025 నుండి అమల్లోకి వచ్చిన ఒప్పందం ఒక గొప్ప అవకాశంగా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందం ద్వారా స్విట్జర్లాండ్ వంటి దేశాలు భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మంత్రి లోకేష్ చేస్తున్న ఈ ముందస్తు ప్రయత్నాలు, ఆ భారీ నిధుల్లో సింహభాగాన్ని ఆంధ్రప్రదేశ్కు మళ్లించడానికి మార్గం సుగమం చేయవచ్చు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఒక నాలెడ్జ్ ఎకానమీని నిర్మించే దిశగా ఉన్నాయి. కేవలం ఫ్యాక్టరీలు రావడం మాత్రమే కాదు, స్విస్ మేధస్సు ఆంధ్ర గడ్డపై కొత్త ఆవిష్కరణలకు వాంది అయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: