15 సెషన్స్‌లో టెట్–2026 నిర్వహణ
రాష్ట్రం(Telangana)లో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2026 పరీక్షలు నేటి (మంగళవారం) తో ముగియనున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలు 9 రోజులపాటు 15 సెషన్స్ లో నిర్వహించారు. నేడు జరిగే పరీక్షలతో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.
Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
రాష్ట్ర వ్యాప్తంగా 2,37,754 దరఖాస్తులు
పరీక్షా కేంద్రాలను ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. టెట్-2026 కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,37,754 దరఖాస్తులు వచ్చాయి.

పేపర్-2 కి 1,52,216 దరఖాస్తులు
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తుల్లో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారి నుంచి 71,670 దరఖాస్తులు వచ్చాయి. వారిలో ప్రభుత్వ స్కూల్స్ పనిచేస్తున్న వారు 49,236 మంది టెట్-2026 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 85,538 దరఖాస్తులు రాగా వాటిలో ఇన్ సర్వీస్ టీచర్ల నుంచి 27,389 ఉండగా.. పేపర్-2కి 1,52,216 దరఖాస్తులు వచ్చాయి.
వాటిలో ఇన్ సర్వీస్ టీచర్లు 44,281 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 3, 4, 5, 6, 8, 9, 11 తేదిల్లో మేజర్ పరీక్షలు జరగగా.. 19, 20 తేదిల్లో మైనర్ పరీక్షలతో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించగా.. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షలను 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: