తెలంగాణలోని నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత(Kavitha) నాయకత్వంలోని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 30 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ స్థాయిలో వ్యూహాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆశావహులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు, అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
సొంత గడ్డ అయిన నిజామాబాద్లో(Kavitha) తన రాజకీయ బలం చూపించాలని తెలంగాణ జాగృతి భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపై అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ రాజకీయాల్లో తన ఉనికిని మరింత బలపర్చుకోవడమే లక్ష్యంగా జాగృతి ముందుకెళ్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: