విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని విదేశీ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఉదయం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సీకోలకు జలవనరుల శాఖ ఇఎన్సికె నరసింహమూర్తి, సిఇకె రామచంద్రరావు, ఎంఇఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు. వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఆరో విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని పలు విభాగాల అధికారులు సరబ్జెత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.
Read also: Andhra Pradesh: నేడు విశాఖకు రానున్న రాహుల్ గాంధీ

Foreign experts visited Polavaram
నిపుణుల బృందం ఆయా పనులను నిశితంగా పరిశీలించింది
వీరు పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జి హిల్, ప్రధాన డాం ఎగువ, దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు ఏం వెంకటేశ్వరరావు, ఇఎన్సికే నరసింహ మూర్తి, సిఇకె రామచంద్రరావు ఎంఇఐ ఎల్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల బృందం ఆయా పనులను నిశితంగా పరిశీలించింది. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంది. ఆ తరువాత వారు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: