తెలంగాణ (TG) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. కొత్తగా ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా.సి.నారాయణరెడ్డి పేరిట అవార్డులను అందజేయనున్నారు.
Read Also: JEE Mains : రేపటి నుంచి JEE మెయిన్స్

నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలి
అర్హులైన నిర్మాతలు, ఇతర అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందవచ్చని, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలని అర్హులైన నిర్మాతలను ప్రభుత్వం తరుపున మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: