ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Read Also: IND vs NZ: టీమిండియా ఓటమి పై సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే?

రెండు మ్యాచ్ లు
ప్రస్తుతం ఆర్సీబీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్లలోనే మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈసారి పైచేయి ఎవరిదో? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్(5-23) విజృంభణతో చతికిలపడిన గుజరాత్ ఈసారి ప్రతీకారానికి సిద్ధమవుతోంది.
ఇక్కడ గెలిస్తే గార్డ్‌నర్ బృందం ఆరు పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంటుంది. గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమైన అనుష్క శర్మ గుజరాత్ తుది జట్టులోకి వచ్చింది. గెలుపు జోరుమీదున్న ఆర్సీబీ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: