టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభ దశలోనే అదృష్టం, క్రేజ్ రెండూ కలిసొచ్చిన హీరోయిన్ (Actress) గా శ్రీలీల ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది. తన ఎనర్జీ, డ్యాన్స్, గ్లామర్‌తో పాటు సహజమైన నటనతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
Read Also: Actress: పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ

‘మాస్ జాతర’ సినిమాలో హీరోయిన్ గా
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అనగనగ ఒక రాజు’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నిజానికి ఈ సినిమా శ్రీలీల చేయాల్సింది. కానీ ప్రాజెక్ట్ డిలే అవ్వడం, ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది.
‘అనగనగ ఒక రాజు’ సినిమాని వదులుకున్న శ్రీలీల.. ఆ తర్వాత అదే సితార ప్రొడక్షన్ లో రవితేజ హీరోగా రూపొందిన ‘మాస్ జాతర’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. కానీ ఆమె వదులుకున్న నవీన్ పోలిశెట్టి మూవీ మాత్రం ఘన విజయం సాధించింది. దీంతో ఒకప్పుడు శ్రీలీలలకు అదృష్టం కలిసొచ్చింది కానీ.. ఇప్పుడు కలిసిరావడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: