సంకల్ప యాత్రను ఉన్నతమైన మనసుతో చేపడుతున్న బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఆ వెంకన్న ఆశీస్సులు ఉండాలని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు. బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సతీసమేతంగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిజాయితీగా పాలన చేసిన చంద్రబాబు లాంటి మహా నాయకుడు అరెస్టు చేసినప్పుడు బండ్ల గణేష్ స్పందించిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని ఆయన అన్నారు.
Read Also: Bandla Ganesh: “చంద్రుడి” కోసం సంకల్పం.. మొదలైన “గణేశుడి” ప్రయాణం..
దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు ఈ సంఘటనపై స్పందించడానికి గణేష్(Bandla Ganesh) చేసిన పోరాటమే కారణమన్నారు. ప్రేమ అభిమానం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అభిమానించడమే తన ఆస్తిగా పెట్టుకున్న గొప్ప వ్యక్తి బండ్ల గణేష్ అని కొనియాడారు. సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది స్పష్టంగా తెలిసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో గణేష్ సంకల్పయాత్ర ఎలాంటి వరుదుడుకులు లేకుండా చక్కగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: