
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ దర్శకుడు మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘VT15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తాజాగా ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసారు. విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Read Also: Karur Stampede: సీబీఐ విచారణకు హాజరైన విజయ్
ఈ ఏడాది వేసవిలో థియేటర్లలో విడుదల?
కనకరాజు అనే వ్యక్తి కోసం కొరియా పోలీసులు ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌ను చిత్రహింసలు పెట్టడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇంతలో పౌర్ణమి రాత్రి కనకరాజు (వరుణ్ తేజ్) ఓ ఆత్మ ఆవహించిన వాడిలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేస్తాడు. చివర్ లో, అతను కొరియన్ భాషలో ‘నేను తిరిగొచ్చాను’ అని చెప్పడం,
“ఈ కనకరాజు మన కనకరాజు కాదు” అంటూ ఫొటోగ్రాఫర్ చెప్పే డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, పనీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం, కొరియాలలో కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమాను, ఈ ఏడాది, వేసవిలో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: