దక్షిణ కొరియా స్టార్, ప్రపంచ నంబర్–1 షట్లర్ ఆన్ సె యంగ్, ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 (India Open World Tour Super-750) లో డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–13, 21–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యిపై గెలిచింది. ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో 36వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లిన్ చున్ యి, మహిళల డబుల్స్‌లో లియు షెంగ్‌షు–టాన్ నింగ్, పురుషుల డబుల్స్‌లో లియాంగ్ వెకెంగ్–వాంగ్ చాంగ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో డెచాపోల్–సుపిసారా టైటిళ్లు గెలుచుకున్నారు.
Read Also: ODI: గౌతమ్ గంభీర్‌పై అభిమానుల తీవ్ర ఆగ్రహం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: