రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌సమండ్ జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్ (Collector) అరుణ్ కుమార్ హసిజా ఒక వినూత్నమైన, నిర్ణయం తీసుకున్నారు.తన జిల్లాలో నిరుపేదలు అందరికీ ప్రభుత్వ పథకాలు అందే వరకు తాను జీతం తీసుకోనని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో 30 వేల మంది అత్యంత పేద ప్రజలు ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరి కోసం ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కలెక్టర్ అరుణ్ కుమార్.. మూడు కీలక పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: TG: పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
లబ్ధిదారుల నమోదు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ తీవ్ర అసహనం
లబ్ధిదారులకు ఇవన్నీ పూర్తిగా అందేవరకు తాను జీతం కూడా తీసుకోనని చెప్పారు.. ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు ఉచితంగా గోధుమలు, రేషన్ అందించడం, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను గుర్తించి వారి చదువు, సంక్షేమం కోసం ఆర్థిక సాయం అందించడం, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు సకాలంలో పింఛన్లు అందేలా చూడటం. ఇవన్నీ చేశాకే ఆయన తన జీతాన్ని తీసుకుంటానని చెప్పారు. లబ్ధిదారుల నమోదు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ (Collector) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కేవలం మాటలతో సరిపెట్టకుండా.. “పథకాల నమోదు వంద శాతం పూర్తయ్యే దాకా నా జనవరి నెల జీతం ప్రాసెస్ చేయవద్దు” అని అకౌంటెంట్‌ను ఆదేశించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కలెక్టర్ తన సొంత జీతాన్నే పణంగా పెట్టడంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫలితంగా కేవలం కొద్ది రోజుల్లోనే పింఛన్ల పథకం కింద 1,90,440 మంది పేర్లను అధికారులు నమోదు చేశారు. పెండింగ్‌లో ఉన్న ధ్రువీకరణ పత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: