పెంచికల్ పేట్ (Adilabad) : పొలాల్లో పంట పండితే చాలు… ఆ పంట వెనుక ఉన్న కూలీ జీవితం ఎవరికీ అవసరం లేదా? ఇదే నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వలస కూలీల స్థితిగతులపై నిలుస్తున్న ఘాటు ప్రశ్న. వ్యవసాయ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వలస కూలీలు(Migrant Workers) ఉమ్మడి జిల్లాకు తరలివస్తున్నారు. పత్తి, మిర్చి, వరి నాటు పనులు కలుపు తీయడం వంటి కష్టసాధ్యమైన పనులతో రైతు పొలాలను పండిస్తున్నారు. కానీ పని ముగిశాక వారి జీవితం గౌరవంగా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు.
Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

పొలాల్లో చెమట, గుడిసెల్లో జీవితం
పొలాల చుట్టుపక్కన తాత్కాలిక గుడిసెలే వారి ఇళ్లు. తాగునీరు లేదు… మరుగుదొడ్లు లేవు… విద్యుత్ సదుపాయాలు అందని ద్రాక్షే. చలి వర్షం ఎండ మూడు కాలాలు వారికి శత్రువులే. గర్భిణీలు, చిన్నారులు అనారోగ్యాల బారినపడుతున్నా చికిత్సకు చేరే దారి కనిపించడం లేదు. కార్మిక చట్టాలు వలస కూలీలకు భద్రత, నివాస వసతులు వైద్య సదుపాయాలు కల్పించాలంటున్నాయి.
కార్మిక చట్టాలు కాగితాలకేనా?
కానీ క్షేత్రస్థాయిలో ఆ చట్టాలు ఎక్కడ..? కాగితాల మీద ఉన్న హక్కులు గుడిసెల్లో ఉన్న కూలీలకు ఎందుకు చేరడం లేదు? ఇది వ్యవస్థ వైఫల్యమే మానవీయతకు మచ్చగా మారుతోంది. వలస కూలీల పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. అంగన్వాడి పాఠశాలల జాడలే లేవు. మహిళా కూలీలు భద్రత సమస్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయినా ఈ దృశ్యాలపై అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూస్తోంది.? పొలాల్లో పంట పండే ప్రతి చేతికి భద్రత, గౌరవం, మానవీయత కల్పించడమే అధికార ప్రజాప్రతినిధుల బాధ్యత.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: