అనంతపురం : ఒత్తిడితో (Stress) నిండిన జీవితాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి నవ్వడమే దివ్య ఔషధమని, అది తెలియని చాలా మంది కృత్రిమ మందుల వెంటవడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రముఖ ఔషధ కంపెనీ శాంతా బయోటిక్ అధినేత, 3. అభిప్రాయపడ్డారు. ప్రతి మనిషి హాయిగా నవ్వుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని దానిని పోగొట్టుకొని అనారోగ్యం పాలుకావద్దని ఆయన ప్రజలకు సూచించారు. అనంతపురంలోని ఎస్ఎస్ బి ఎన్ కళాశాలలో ఆదివారం జరిగిన మానవతా రక్తదాతల బృందం కన్వీనర్ తరిమెల అమర్నాథెడ్డి రచించిన “కాసేపు నవ్వుకుందాం” పుస్తకావిష్కరణ (Book Launch) కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. ఆర్ఎఫ్ ఎకాలజి సెంటర్ డైరెక్టర్ వై.వి. మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యుపిపిహెచ్సి మాజీ సభ్యులు డాక్టర్ వై. వెంకట రామిరెడ్డి, మానవతా కో కన్వీనర్ సలీంమాలిక్, కవి ఏలూరు ఎంగన్న, విరసం కవయిత్రి శశికళ, విశ్రాంత అధ్యాపకులు ఆయూబ్ఫాన్, తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకులు పి.వి రెడ్డి, సీనియర్ జర్నలిస్టు గుంటి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read also: Vizag: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

‘కాసేపు నవ్వుకుందాం’ పుస్తకావిష్కరణ
సభలో పద్మ విభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాదొడ్డి మాట్లాడుతూ “కాసేపు నవ్వుకుందాం” పుస్తకాన్ని రచించిన తరిమెల తరిమెల అమర్నాథ్ రెడ్డి రచించిన కాసేపు నవ్వుకుందాం పుస్తకం(Book Launch) ఆవిష్కరిస్తున్న దృశ్యం ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు అమర్నాథ్ రెడ్డి విలక్షణ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శ మన్నారు. తరిమెల అమర్నాథ్ రెడ్డి రచనలకు జిల్లాలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో అభిమానులు వున్నారని కొనియడారు. తరిమెల అమర్నాథ్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే తనకు స్నేహితుడు అయ్యాడని ఆయనతో మాట్లాడుతుంటే కాలం ఇట్లే గడిచిపో తుందని ఆయన పుస్తకాలను అందరూ చదవాలన్నారు. అనంత వాసులతో కలిగివున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నిత్య జీవితంలో వుండాల్సిన హాస్యం ప్రాధాన్యతను వివరిస్తూ సందర్భోచిత జోకులతో ఆయన కడుపుబ్బా నవ్వించారు. ఆరోగ్యం కోసం నవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పుస్తకానికి ఆదరణ
సభలో ఆర్ఎఫ్ ఎకాలజి డైరెక్టర్ మల్లారెడ్డి, యుపిపిహెచ్సి మాజీ సభ్యులు వెంకటరామిరెడ్డి, కవి వేలూరు ఎంగన్న, మురళీకృష్ణ, పివి. రెడ్డి, తదితరులు తమ ప్రసంగాల్లో “కాసేపు నవ్వు కుందాం” పుస్తకం రచయిత తరిమెల అమర్నాథ్ రెడ్డి తన జీవితంలో సమాజం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రక్తదాన ఉద్య మంలో నిరంతరం కృషి చేస్తూనే సమాజంలో మూఢనమ్మకాలను పార ద్రోలేందుకు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నారని వివరించారు. ఇప్పటికే 13 పుస్తకాలను అమర్నాథ్ రెడ్డి రచించారని “కాసేపు నవ్వుకుందాం” పుస్తకం 14వదని అందరూ చదవాలని ఆయన విజప్తి చేశారు. సమావేశంలో సాయిబాబా కళాశాల కరస్పాండెంట్ బిఎల్ఎన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, డాక్టర్ నిర్మలారెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్స్ రమేష్‌నారాయణ, వెంకటరెడ్డి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి. రమణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నరసింహప్ప, రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటి మేయర్ విజయభాస్కర్‌రెడ్డి, మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాష, డాక్టర్ ప్రసూన, ఇంటాక్ చైర్మన్ రాంకుమార్‌రెడ్డి, జనవిజ్ఞానవేదిక నాయకులు ప్రేమ్‌కుమార్, వివేకానంద యోగా కేంద్రం ముఖ్యులు రాజశేఖర్ రెడ్డి, శాంతినారాయణ, వెంకటేశులు, జూటూరు తులసిదాసు, శ్యాంసుందర్‌శాస్త్రి, ఆశ్రయ అనాధాశ్రమం నిర్వాహకులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: