నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్, స్పష్టమైన అభిప్రాయాలు, ఎమోషనల్ స్టేట్మెంట్స్తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. షాద్నగర్ నుంచి తిరుమల (Tirumala) వరకు ‘సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్.
Read Also: Celebrity temple visit : టోక్యోలో అల్లు అర్జున్ కుటుంబంతో దర్శనం, ఫోటోలు వైరల్!

సంకల్పయాత్ర
గత ప్రభుత్వ హయాంలో, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్థాపానికి గురై తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని చెప్పారు.స్వామివారి దయతోనే చంద్రబాబు జైలు నుంచి విడుదలవడమే కాకుండా ఏపీలోని గత ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంకల్పయాత్ర కేవలం తన మొక్కు కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు బండ్ల గణేశ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: