
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, నారా లోకేశ్ స్విట్జర్లాండ్ (Switzerland) లోని భాగంగా జ్యూరిక్ కి చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక World Economic Forum 2026 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన యూరప్ పర్యటన చేపట్టారు. జ్యూరిక్ విమానాశ్రయంలో దిగిన మంత్రి లోకేశ్‌కు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేశ్ అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లనున్నారు.
Read Also: AP Government: వచ్చే నెల మెగా డిఎస్సీ! 2,500 టీచరు పోస్టులు భర్తీకి అవకాశం
సాంకేతిక దిగ్గజాలతో చర్చలు
సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్.. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్, ఐబిఎమ్ (IBM), ఎన్విడియా (NVIDIA) వంటి సాంకేతిక దిగ్గజాలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ కు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, యువతకు ఉపాధి కల్పన, కృత్రిమ మేధ (AI) వంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దావోస్ లోని ఏపీ పవిలియన్ లో, జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: