vijay tvk cbi summons : కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే (TVK) నేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలో హాజరు కావాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం (vijay tvk cbi summons) రేగడంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను విచారించిన సీబీఐ, ఈ నెల 12న విజయ్‌ను తొలిసారి ఢిల్లీలో విచారించింది.
Read Also: U19 World Cup controversy : అండర్-19 WCలో హ్యాండ్‌షేక్ వివాదం, బంగ్లా బోర్డు క్లారిటీ!
కార్యక్రమం నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?, భారీ జనసందోహంపై ముందస్తు సమాచారం ఉందా?, భద్రతా చర్యలు ఎందుకు విఫలమయ్యాయి? వంటి అంశాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు పండుగల అనంతరం రెండో దఫా విచారణకు విజయ్‌ను మళ్లీ ఢిల్లీకి పిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: