UP road accident : ఉత్తర భారతదేశంలో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ–లఖ్‌నవూ జాతీయ రహదారి (NH-9)పై షాహ్వాజ్‌పూర్ దోర్ గ్రామ సమీపంలో పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వరుసగా సుమారు 10 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ప్రమాదంలో 12 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తర్వాత పోలీసులు క్రేన్ల (UP road accident) సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. దట్టమైన పొగమంచే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్
ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తర రాష్ట్రాల్లో కూడా పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 430 మార్కును దాటడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య నియంత్రణ కోసం జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో విజిబిలిటీ చాలా ప్రాంతాల్లో జీరో స్థాయికి చేరింది.
పాలెం, అమృత్సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్‌రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోవడంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: