ECI decision : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటర్ల నమోదు ప్రక్రియలో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎన్నికల అధికారులపై తీసుకున్న కఠిన చర్యలను ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని భారత ఎన్నికల సంఘం (ECI) తిరస్కరించింది.
ఈ నెల ప్రారంభంలో బెంగాల్ ప్రభుత్వం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి, నలుగురు ఎన్నికల అధికారులపై సస్పెన్షన్, ఎఫ్ఐఆర్ నమోదు వంటి చర్యలను రద్దు చేయాలని కోరింది. అయితే ఈ అభ్యర్థనకు ఎన్నికల సంఘం అంగీకరించలేదని అధికారులు తెలిపారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మెదినీపూర్ జిల్లాల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్లు నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో బారుయిపూర్ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన (ECI decision) ఈఆర్వో డెబొట్టమ్ దత్తా చౌదరి, ఏఈఆర్వో తథాగత మండల్‌తో పాటు మోయ్నా నియోజకవర్గ ఈఆర్వో బిప్లబ్ సర్కార్, ఏఈఆర్వో సుదీప్త దాస్ ఉన్నారు.
గతేడాది ఆగస్టులోనే ఈ నలుగురిని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేవలం సస్పెన్షన్ వరకే పరిమితమై, ఎఫ్ఐఆర్‌ల నమోదు విషయంలో ఆలస్యం చేసింది. తాజాగా మరోసారి ఈసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో తీవ్రంగా స్పందిస్తూ, ఎన్నికల సంఘం బీజేపీ ప్రభావంలో పనిచేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోబోమని ఆమె అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈసీఐ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: