हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య

Aanusha
HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య

దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం హైదరాబాద్‌ (HYD) లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన చెరగని ముద్ర వేశారని అన్నారు.

Read Also: Senior actress Sharada: నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

HYD: On the death anniversary of Sr. NTR, Balayya paid his respects at the memorial
HYD: On the death anniversary of Sr. NTR, Balayya paid his respects at the memorial

దేశవ్యాప్తంగా అమలు

అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, ఎన్టీఆర్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. “మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం. ఆ లక్షణాలు ఎన్టీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేసి, నటనలో పరకాయ ప్రవేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు” అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారని,

రాజకీయాలను కొందరికే పరిమితం కాకుండా అందరికీ చేరువ చేశారని తెలిపారు.పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు కాబట్టే బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో ఆయన తీసుకొచ్చిన పథకాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులతో ప్రజలకు మేలు చేశారని, ఆయన స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870