తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాలేరు నియోజకవర్గంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలకు నేరుగా ఉపయోగపడే పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
Read also: Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి
సీఎం పర్యటన సందర్భంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు నర్సింగ్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు. ఈ ద్వారా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే స్థానిక రైతులు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉండే మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా జేఎన్టీయూ కళాశాల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు ఊతం, నేతలతో సమీక్ష
వ్యవసాయానికి(Telangana) కీలకమైన మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి జిల్లాలో అమలవుతున్న పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. పాలేరు నియోజకవర్గ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. అక్కడి ఏర్పాట్లు, భద్రత, ప్రజా సౌకర్యాలపై అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: