Ram Charan : గ్లోబల్ స్టార్ Ram Charan తన తదుపరి సినిమా కోసం పూర్తిగా ఫోకస్‌తో ముందుకు సాగుతున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ కఠినమైన శారీరక కసరత్తులు చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన, “ఫైర్ మీదున్నా… నిశ్శబ్దంగా పనిచేస్తున్నా! తర్వాతి సవాల్‌కు సిద్ధం” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానుల మధ్య వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక షెడ్యూల్‌ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ షెడ్యూల్‌లో రామ్ చరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రశంసించారు. ఈ నెలాఖరు నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో, ప్రముఖ స్టంట్ (Ram Charan) మాస్టర్ శామ్ కౌశల్ ఆధ్వర్యంలో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని టాక్.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: